నిజమైన స్నేహం – కవిత

కుల మత బేధం ఎరుగనిది ….

మనసు మమతే ముఖ్యమనేది ….!


ధనిక పేద బేధం ఎరుగనిది ….

అనురాగ ఆప్యాయతే ముఖ్యమనేది …!!


స్వార్థం కపటం ఎరుగనిది ….

నమ్మకం నిస్వార్దమే ముఖ్యమనేది ….!!!!


కష్ట సుఖాలలో స్నేహంలో బేధం ఎరుగనిది ….

కష్టం లోను సుఖం లోను స్నేహమే ముఖ్యమనేది …!!!!


ఇలాంటి నిజమైన స్నేహం ……

కలకాలం ఇలలో నిలిచెను పదికాలాలు పదిలం …!!!!!