5 హై డిమాండ్ జాబ్స్

5 సంవత్సరాల క్రితం లేనివి, ఇప్పుడు డిమాండ్‌లో ఉన్న ఉద్యోగాలు: వేగంగా మారుతున్న డిజిటల్ ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఉద్యోగాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన పనులు ఇప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగాలుగా మారాయి! మీరు విద్యార్థి అయినా, ఫ్రీలాన్సర్ అయినా లేదా ఉద్యోగి అయినా సరే, ఈ ఆర్టికల్‌లో మీరు గత 5 సంవత్సరాల్లోనే పుట్టిన ఐదు ట్రెండింగ్ జాబ్స్ గురించి తెలుసుకోగలరు. అంతేకాదు, వాటిని ఉచితంగా ఎలా నేర్చుకోవచ్చో కూడా తెలుసుకుంటారు.

1. ప్రాంప్ట్ ఇంజనీర్

అంటే ఏంటి:

ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది క్రియేటివ్ మరియు సిస్టమెటిక్‌గా ఆలోచించి AI టూల్స్‌కి (ఉదాహరణకి ChatGPT, Midjourney, Claude లాంటి వాటికి) సూచనలు ఇచ్చే వ్యక్తి. ఈ వ్యక్తి ఇచ్చే ప్రాంప్ట్ ఎంత క్లారిటీగా, క్రీయేటివ్‌గా ఉంటే, ఆ AI అందించే అవుట్‌పుట్ కూడా అంత ఉత్తమంగా ఉంటుంది.

ఉదాహరణకి:

ఒక సింపుల్ ప్రాంప్ట్: "ఒక పక్షిని గీయి."  

ఒక స్మార్ట్ ప్రాంప్ట్: "సూర్యాస్తమయం సమయంలో నదిపై ఎగురుతున్న రంగురంగుల హమ్మింగ్‌బర్డ్ డిజిటల్ ఆర్ట్ పెయింటింగ్‌ను సృష్టించు."

ఇది ఎందుకు ప్రత్యేకం:
  • సృజనాత్మకత మరియు సాంకేతిక ఆలోచనల మేళవింపు  
  • కోడ్ అవసరం లేదు  
  • AI స్టార్టప్స్ మరియు కంటెంట్ టీమ్స్‌లో భారీ డిమాండ్  
  • ఫ్రీలాన్స్ గా, ఫుల్ టైమ్ గా పని చేసే స్వేచ్ఛ  
ఎలా నేర్చుకోవాలి:
  • ప్రతిరోజూ ChatGPT లేదా Claude వాడుతూ ప్రాక్టీస్ చేయండి  
  • PromptHero.com, FlowGPT.com వంటి వెబ్‌సైట్లను సందర్శించండి  
  • YouTubeలో ప్రాంప్ట్ ట్యుటోరియల్స్ చూడండి  
  • చిత్రాలు, కోడ్, ఇమెయిల్స్, బ్లాగ్స్ వంటి వివిధ రంగాల కోసం ప్రాంప్ట్‌లు రాయడంలో నైపుణ్యం సాధించండి. విభిన్న సందర్భాల్లో సరైన ప్రాంప్ట్‌లతో ప్రయత్నించడం ద్వారా మీ స్కిల్స్ మరింత మెరుగుపడతాయి.  

2. వర్చువల్ స్టైలిస్ట్

అంటే ఏంటి:

వర్చువల్ స్టైలిస్ట్ అంటే ఆన్‌లైన్‌లో ఫ్యాషన్ సలహాలు అందించే వ్యక్తి. ఫోటోలు, వీడియోలు, AI ఆధారిత స్టైల్ యాప్స్ వంటివి ఉపయోగించి, కస్టమర్స్ వ్యక్తిత్వం, ఈవెంట్, లేదా బాడీ టైప్‌కి సరిపోయే దుస్తులను ఎంచుకునేందుకు సహాయం చేస్తారు.

ఇది ఎందుకు ప్రత్యేకం:
  • ఇంటి నుంచి పని చేయవచ్చు  
  • ఫ్యాషన్ కోర్స్ డిగ్రీ అవసరం లేదు  
  • Instagram, Zoom, లేదా స్టైల్ యాప్స్ ద్వారా పని చేయవచ్చు  
  • ఫ్యాషన్ మరియు టెక్నాలజీ కలిసిన ఆకర్షణీయమైన ఉద్యోగం!  
ఎలా నేర్చుకోవాలి:
  • కలర్ థియరీ, బాడీ టైప్స్ గురించి YouTube, Skillshare ద్వారా తెలుసుకోండి  
  • StyleDNA, SmartMirror, Lookiero వంటి యాప్స్ వాడండి  
  • Pinterest లేదా Canvaలో నమూనా లుక్స్ (looks) క్రియేట్ చేయండి  
  • ఫ్రీ స్టైలింగ్ టిప్స్ ఇవ్వడం ద్వారా మీ పోర్ట్ఫోలియోని మెరుగుపరుచుకోండి  

3. మెటావర్స్ టూర్ గైడ్

అంటే ఏంటి:

మెటావర్స్ టూర్ గైడ్ అనేది Decentraland, Roblox, Spatial లాంటి వర్చువల్ ప్రపంచాల్లో యూజర్స్‌కి సాయం చేస్తూ, ఆ డిజిటల్ ప్రపంచాలను ఆస్వాదించేందుకు మీరు వారికి మార్గనిర్దేశం చేస్తారు. మరియు డిజిటల్ మ్యూజియంలు, ఈవెంట్స్, కచేరీలు, బ్రాండ్ అనుభవాలు ఎలా చూడాలో తెలుపుతూ గైడ్ చేస్తారు.

ఇది ఎందుకు ప్రత్యేకం:
  • మీ గదిలో నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారితో పరిచయం కావచ్చు.  
  • గేమింగ్ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాల సమ్మేళనం  
  • బ్రాండ్స్ ప్రమోషన్స్ మరియు విద్యా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు  
  • VR లేదా గేమింగ్ అంటే ఇష్టపడేవారికి అద్భుతమైన అవకాశం  
ఎలా నేర్చుకోవాలి:
  • Spatial.io, VRChat, Roblox వంటి ఉచిత ప్లాట్‌ఫారమ్‌లు ట్రై చేయండి  
  • ప్రాథమిక 3D నావిగేషన్ మరియు అవతార్ వాడకాన్ని నేర్చుకోండి  
  • YouTubeలో మెటావర్స్ ఒరియెంటేషన్ వీడియోలు చూడండి  
  • మీ స్నేహితులు లేదా ఆన్‌లైన్ యూజర్లకు చిన్న వర్చువల్ అనుభవాలు ఇవ్వండి  

4. AI ఫిట్‌నెస్ కోచ్

అంటే ఏంటి:

AI ఫిట్‌నెస్ కోచ్ అనేది ఆరోగ్యాన్ని మరియు టెక్నాలజీని కలిపే కొత్త తరం ఉద్యోగం. మీరు స్మార్ట్ యాప్స్ సహాయంతో వర్కౌట్ మరియు డైట్ ప్లాన్‌లను రూపొందిస్తారు. ఈ యాప్స్ యూజర్ ప్రోగ్రెస్‌ని ట్రాక్ చేసి, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఫలితాలను కస్టమైజ్ చేస్తాయి.

ఇది ఎందుకు ప్రత్యేకం:
  • జిమ్ ట్రైనర్ కావాల్సిన అవసరం లేదు  
  • ఫిట్‌నెస్ లక్ష్యాలను మార్గనిర్దేశం చేయడానికి AI సాధనాలను ఉపయోగించండి  
  • ఇప్పుడు చాలా మంది ఆన్‌లైన్ మరియు AI ఆధారిత కోచింగ్‌ని ఆసక్తిగా కోరుతున్నారు  
ఎలా నేర్చుకోవాలి:
  • Fitbod, Ultrahuman, Freeletics వంటి యాప్స్ ట్రై చేయండి  
  • YouTube ద్వారా ఫిట్‌నెస్ గురించి ప్రాథమిక జ్ఞానం సంపాదించండి
  • డేటా ట్రాక్ చేయడానికి స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్లు వంటి wearables ఉపయోగించండి  
  • 7 రోజుల ఉచిత ప్లాన్లు అందించి, ఫీడ్‌బ్యాక్ కోసం టెస్టిమోనియల్స్ కోరండి  

5. రిమోట్ డ్రోన్ ఆపరేటర్

అంటే ఏంటి:

రిమోట్ డ్రోన్ ఆపరేటర్ అంటే, ఫోటోగ్రఫీ, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, ఈవెంట్స్, లేదా రిస్క్యూ మిషన్ల కోసం డ్రోన్లను ఆన్‌లైన్ ద్వారా దూరం నుండీ నియంత్రించే వ్యక్తి. ఈ పని కోసం మీరు ఆ సైట్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.

ఇది ఎందుకు ప్రత్యేకం:
  • ఏరియల్ వీడియోల డిమాండ్ ఎక్కువగా ఉంది  
  • వివాహాలు, వ్యవసాయ భూములు, నిర్మాణ స్థలాలు వంటి ప్రదేశాలను కెమెరా ద్వారా కవర్ చేసి ఆదాయం పొందే అవకాశం  
  • 2025 లో డ్రోన్ మార్కెట్‌లో ఈ ఉద్యోగం వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు  
ఎలా నేర్చుకోవాలి:
  • DJI Mini లేదా Ryze Tello వంటి డ్రోన్ కొనండి  
  • YouTubeలో డ్రోన్ ఎగరడం, సురక్షితంగా వాడటం గురించి వీడియోలు చూడండి  
  • వీడియోలు తీసి, వాటిని ఎడిట్ చేయడం ప్రాక్టీస్ చేయండి  
  • డ్రోన్ వినియోగానికి సంబంధించిన నియమాలు తెలుసుకోండి: ప్రతి దేశానికి తక్కువ లేదా ఎక్కువ డ్రోన్ లైసెన్స్ అవసరాలు ఉంటాయి  
చివరగా చెప్పదలిచినవి

ఇవి కొంత భవిష్యత్తుకి చెందిన ఉద్యోగాల్లా అనిపించవచ్చు, కానీ ఇవి ఇప్పటికే ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు. మంచి విషయం ఏమిటంటే, కాలేజీ డిగ్రీకి లేదా ఆఫీస్ ఇంటర్వ్యూకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఆన్‌లైన్‌లో నేర్చుకొని, చిన్న పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసి, మీ పని అందరితో పంచుకోవచ్చు.

మీకు సాంప్రదాయ 9 నుంచి 5 పని శైలితో విరుద్ధంగా, కొత్త దిశలో పని చేయాలనిపిస్తే, ఈ నూతన ఉద్యోగాలు మీకు సరైన మార్గం కావచ్చు.

రాసినవారు: పద్మశ్రీ

పద్మశ్రీ రాసిన ఇంకొన్ని ఆలోచనాత్మక వ్యాసాలను చూడండి: click here