20 – 60 ఏళ్ల వయస్సులో…

మనిషి జీవితంలో అతి ముఖ్యమైన వయసుల మలుపులు

20 ఏళ్ళు – జీవితాన్ని ఆలోచించే వయస్సు

 60 ఏళ్ళు – జీవితాన్ని ఆచరించే వయస్సు

20 ఏళ్ళు – వేగం 60 లో ఉంటుంది

60 ఏళ్ళు – వేగం 20 లో ఉంటుంది

20 ఏళ్ళు – బాల్యానికి, వృద్ధాప్యానికి నడుమ మజిలీ

60 ఏళ్ళు – మళ్ళీ బాల్యాన్ని గుర్తుచేసే చివరి మజిలీ

20 ఏళ్ళు – జీవితం అంటే ఎంతో… అనుకుంటారు

60 ఏళ్ళు – జీవితం అంటే ఇంతే!!! అనుకుంటారు

20 ఏళ్ళు – ఆవేశం కలుగుతుంది

60 ఏళ్ళు – ఆయాసం మిగులుతుంది

20 ఏళ్ళు – బ్రతుకు ఒక వరం

60 ఏళ్ళు – బ్రతుకు ఎంత భారం

20 ఏళ్ళు – ఆ జేబులో కొన్ని డబ్బులు ఉంటాయి

60 ఏళ్ళు – దాని వెనుక అన్నీ జబ్బులే ఉంటాయి

20 ఏళ్ళు – ప్రేమ అంటే అమ్మాయి, అబ్బాయి మధ్య

60 ఏళ్ళు – ప్రేమ అంటే అన్ని బంధాల మధ్య

20 ఏళ్ళు – అందమైన భార్య/భర్త, ఇల్లు, జీతం ఉంటే చాలు

60 ఏళ్ళు – ఆత్మీయ స్పర్శ, మాట, కౌగిలింత ఉంటే చాలు

6 thoughts on “20 – 60 ఏళ్ల వయస్సులో…”

Comments are closed.