ప్లీజ్ లవ్ మీ – కురచ కథ

ప్లీజ్ లవ్ మీ - కురచ కథ

          ప్రేమ ప్రేమ కోసం పరితపిస్తున్నాడు ప్రీతిష్ చాన్నాళ్లుగా.

          ప్రేమ స్పందించటం లేదు.

          తన ప్రయత్నాలు విఫలమైపోతుంటే మరింత పంతంకు పోతున్నాడు ప్రీతిష్.

          తప్పనిసరై  ప్రేమ స్పందించింది చివరాఖరుగా.

          “నిన్ను ప్రేమిస్తాను. కానీ స్థోమతలేని ఇద్దరు పిల్లలను డిగ్రీ  వరకు నీవు చదివిస్తానని పక్కాగా వ్రాసి రిజిస్టరీ బాండ్పేపర్స్నుముందుగానే ఇవ్వాలి.” అని చెప్పింది ప్రేమ, ప్రీతిష్తో.

          ప్రీతిష్ ఏమీ అనక వెళ్లిపోయాడు.

          రెండు రోజులైనా తిరిగి కనిపించక పోయేసరికి, “డబ్బు ఉంటే చాలదు మానవత్వం ఉండాలి. ఛ. ప్రేమట ప్రేమ” అని అనుకుంది ప్రేమ, ప్రీతిష్కై. 

          ఆ పిమ్మట, మర్నాడు, ప్రేమను కలిసి, ఆమె చేతిలో ఒక పేపర్ పెట్టాడు ప్రీతిష్.

          దాని మీది మేటర్ని చదివిన ప్రేమ, ప్రీతిష్ని చూస్తూ ఉండిపోయింది.

          ఆ రిజిస్టరీ బాండ్ పేపర్న, ప్రీతిష్ చేర్చినవి,  ఇద్దరు బదులు ఐదుగురు పిల్లలను అన్నది,  డిగ్రీ వరకు బదులు పిజి వరకు అన్నది, పైగా దీనికై తొలుతగా టెన్లాక్స్ను ఫిక్సిడ్డిపాజిట్ చేసి, ఆ బాండ్ను ముందుగానే అందచేస్తున్నానన్నవి.

          అప్పుడే, ఆ సంబంధిత ఎఫ్డి బాండ్ను కూడా అందించి, “ప్లీజ్ లవ్మి” అన్న ప్రీతిష్తో, “ఐ లవ్ యూ” అని అంది ప్రేమ ప్రేమగా.

***

21 thoughts on “ప్లీజ్ లవ్ మీ – కురచ కథ”

  1. నిజమైన ప్రేమ కథ. రచయిత అభినందనీయులు.

  2. కథ చిన్నదే కానీ సందేశం గొప్పది. రచయిత గారికి అభినందనలు.

  3. క్లుప్తంగా కథ బాగుంది.

Comments are closed.