History: About Telugu Language in Telugu

About Telugu Language in  Telugu Image

మన తెలుగు భాష ఏంతో ప్రాముఖ్యత కలిగినది. తెలుగు భాష చరిత్ర (History), తెలుగు సంస్కృతి (Culture), సంప్రదాయం (Tradition), ‘తెలుగు’ అను పదం ఎలా వచ్చింది ఇలాంటి ఎన్నో విషయాలు “About Telugu Language in Telugu”లో మీకోసం. చదవండి తెలుగు భాష ప్రాముఖ్యతను తెలుసుకోండి.

దేశ భాషల్లో కెల్లా తీయనైన భాష, ప్రపంచ భాషల్లోనే ఉత్తమ రెండవ లిపి కలిగిన భాష… మన తెలుగు భాష.  ఇంతటి ప్రత్యేకతలు కలిగిన భాష నేడు ఎందుకు అనాదరణకు గురవుతుందో మీరెపుడైనా ఆలోచించారా. ఆలోచిస్తే మంచిదే కానీ ఆలోచించకుంటే…? ఇపుడు ఆలోచించండి!

మన దేశ సంస్కృతి ఎంతో విశిష్టమైనది. దేశంలో ఉన్న అన్ని సమాజాల సంస్కృతుల సమ్మేళనమే మన దేశ సంస్కృతి అని చెప్పవచ్చు. ప్రతీ సమాజానికి ఓ సంస్కృతి ఉంటుంది. మన తెలుగు వారికీ ఓ సంస్కృతీ కలదు. సంస్కృతి అనేది సమాజానికి గుర్తింపు వంటిది. దీన్ని బట్టే ఒక సంస్కృతిని మరో సంస్కృతితో పోల్చి చూడటం అనేది జరుగుతుంది. అసలు ఈ సంస్కృతి  అంటే ఏమిటి అని తెలియని వారు అడిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా ఉన్నారు కొందరు ప్రస్తుతం మన సమాజంలో.

What is Culture and it’s meaning?

సంస్కృతి అంటే ఏమిటి?

సంస్కృతి అంటే ఇంకేదో కాదు… మన భాష, ఆచార వ్యవహారాలూ, బంధాలు, విలువలు, నీతి సూత్రాలు, విద్యావ్యవస్థ మొదలగునవి. ఇవన్నీ సంస్కృతిలో అంతర్భాగం. సంస్కృతి అంటే ఇదే! పైన సంస్కృతిలో మొదట భాషను చెప్పుకున్నాము. మన తెలుగు సంస్కృతిలో మొదటిది అయిన తెలుగు భాషనే మరచిపోతే ఇంకెక్కడ ఉంటుంది మన తెలుగు సంస్కృతి?

నేను గమనించిన దాన్ని బట్టి చెపుతున్నాను. ప్రజల్లో ఒక భావన ఏర్పడింది. అదేంటంటే తెలుగు భాష మాట్లాడితే తాము చదువుకోని వారము అనుకుంటారేమో అని భావించి, తాము చదువుకున్నవాళ్ళము అని అవతలి వారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఎక్కువ మంది పరభాష అయిన ఆంగ్ల భాషను మాట్లాడుతున్నారని గమనించా. ఇలాంటి ఒక భావన ఏర్పడటానికి గల కారణాలు అనేకం కావచ్చు. ఏదైనా అవ్వని కానీ ఈ భావన అనేది ముమ్మాటికి తప్పు అని నా అభిప్రాయం.

పరస్పరం ఒకరికొకరు భావాలను వ్యక్త పరచడం వల్లనే సంస్కృతి అనేది రూపొందుతుంది. అలాంటి భావ వ్యక్తీకరణకు ఆయువు పట్టు వంటిది భాష. అలాంటి మన తెలుగు భాషను పట్టించుకోకపోతే ఇక మన సంస్కృతి ఉనికి ఎక్కడిది? మన భాషతో పాటు ఇతర భాష మాట్లాడే వారితో మాట్లాడటం కోసం, ఉపాది కోసం, మరో భాషను అభ్యసించవచ్చు. ఇందుకు నేను విరుద్ధం కాను. కానీ ఆ మరో భాష మన సొంత భాష ఉనికిని పోగొట్టకూడదు అని నా అభిప్రాయం. సంస్కృతిలో మార్పులు అనేవి సహజం. తరాలు మారుతున్న కొద్ది కాలానుగుణంగా ఇతర సంస్కృతులలోవి మన సంస్కృతిలోకి సంగ్రహించుకోవడం కొన్ని వదిలేయడం అనేవి జరుగుతూ ఉంటాయి. అలా అని భాషనే వదిలేస్తే ఇక కొన్ని రోజులు అయ్యాక తెలుగు సంస్కృతి మాయమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఆయా సమాజాల వారు మాట్లాడే వారి సొంత భాషను మాతృభాష అంటారు. ఎందుకంటే మనకు జన్మనిచ్చి అన్ని నేర్పేది తల్లి. అలాగే పుట్టిన దగ్గర నుండి మనం అన్నీ గ్రహించేది, తెలుసుకునేది తల్లి భాషలో. అందుకే దాన్ని మాతృభాష అంటారు. తెలుగు మన మాతృభాష. కాబట్టి ఇకనుంచైనా తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడదాము. తెలుగు సంస్కృతిని కాపాడుదాం. ఏమంటారు?

Know about Telugu Language in Telugu

ఇపుడు తెలుగు భాష గురించి కొంత తెలుసుకుందాం.

తెలుగు భాష గురించి చెప్పుకునేందుకు ఏంతో ఉన్నా కొన్ని ముఖ్య విషయాలను మాత్రమే సంక్షిప్తంగా తెలియజెప్పాలి అనుకుంటున్నా.

ఆంద్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారిక భాష అయిన తెలుగు భాష ద్రవిడ భాషల్లో ఒకటి. 2008లో మన తెలుగు భాషకి అలాగే మిగత భాషలైన సంస్కృతం, కన్నడ, తమిళ భాషలకు భారత ప్రభుత్వము “ప్రాచీన భాష” హోదాను కల్పించింది.

తెలుగు పదజాలం పై కొన్ని భాషల ప్రభావం ఉంది. ముఖ్యంగా సంస్కృత భాష ప్రభావం తెలుగు పదజాలం పై చాలా ఎక్కువ. ఇక పొతే తెలుగు భాష పై తెలుగు ప్రజలను పాలించిన పాలకుల భాషా ప్రభావం కూడా చాలా ఎక్కువే ఉందని చెప్పవచ్చు. ఈ విషయం తెలంగాణ ప్రాంత మాండలికంలో మనం గమనించవచ్చు. తెలుగు ప్రాంతాల్లో…. అప్పట్లో తెలంగాణాలో నిజాం పాలన ఉండేది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు దాదాపు రెండు శతాబ్దాల వరకు బ్రిటిష్ పాలనలో ఉండేవి.

తెలంగాణలో, ముస్లింల పాలన కాలంలో వారి భాష తెలుగు భాషపై ఎంతో ప్రభావం చూపిందని చెప్పవచ్చు. చాలా ఉర్దూ, అరబిక్, పర్షియన్ పదాలు తెలుగు పదజాలంలోకి తీసుకోవడం జరిగింది. ఆంధ్ర, రాయలసీమలు బ్రిటిష్ వారి పాలనలో ఉండటం వలన ఆంగ్ల పదాల ప్రభావం కూడా తెలుగు పై పడింది.

How did the word “Telugu” form?

ఇపుడు “తెలుగు” అన్న పేరు/పదం ఎలా ఏర్పండిందో చూద్దాం.

తెలుగు పదం ఎలా ఏర్పడిందో అన్న విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది చాలా రకాలుగా చెప్పడం మనం వినే ఉంటాం. అలా చెప్పిన అభిప్రాయాల్లో ఒకదాన్ని తెలుసుకుందాం.

మన తెలుగు రాష్ట్రాల్లో కొలువై ఉన్న పరమేశ్వరుడి మూడు ఆలయాల వలన “తెలుగు” పేరు వచ్చిందనేది ఒక అభిప్రాయం. ఆ ముక్కంటుడి మూడు ఆలయాలు తెలంగాణలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం (కరీంనగర్ జిల్లా), ఆంద్ర ప్రదేశ్ లోని శ్రీశైలం (కర్నూలు జిల్లా), భీమేశ్వర స్వామీ ఆలయం (తూర్పు గోదావరి జిల్లా). ఈ మూడు ఆలయాల మధ్యనున్న స్థలాన్ని “త్రిలింగ” అని పిలిచేవారట.  ఈ త్రిలింగ అనే పదం నుండే తెలింగ, తెలుంగు, తెలుగు పదాలు వచ్చుంటాయి అన్నది ఓ వాదన. ఆ విధంగా తెలుగు అన్న పదం/పేరు వచ్చిందని అంటారు.

తెలుగు భాష ఎప్పుడు ఏర్పడింది అన్న ప్రశ్నకు సమాధానం భాషా శాస్త్రవేత్తల అంచనా మేరకు గమనించి నట్లయితే, తెలుగు భాష క్రీ. పూ. 5-4 శతాబ్దం అనగా 2500-2400 ఏళ్ళ క్రితం ద్రవిడ భాషల్లో నుండి విడివడి స్వతంత్ర భాషగా ఏర్పడింది.

ఇపుడు తెలుగు భాష లిపి గురించి తెలుసుకుందాం.

Know about the Telugu Script

దక్షిణ భారతదేశ భాషల మూల భాష ద్రవిడ భాష అయినప్పటికీ వాటి లిపిలు అన్నీ భారతదేశంలోని అన్ని భాషలలాగే ప్రాచీన బ్రహ్మి లిపి నుంచి ఆవిర్భవించాయి. మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తి అశోకుని సామంతులయిన శాతవాహన రాజులు బ్రహ్మి లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకు వచ్చారు.

గుంటూరులోని భట్టిప్రోలులో ఉన్న బౌద్ధ స్తూపం పై చెక్కబడిన శాసనాల్లో మౌర్యుల బ్రహ్మి లిపిని పోలిన అక్షారాలు గుర్తించబడ్డాయి. పరిశోధకుల అంచనా ప్రకారం ప్రాచీన తెలుగు లిపి వ్రాహ్మి లిపి నుంచి వచ్చిందని భావిస్తున్నారు. అన్యితే క్రీ.పూ.  4వ శాతాబ్దం నుంచి తెలుగు లిపి స్పష్టంగా ఉంది.

పూర్తీ తెలుగు శాసనం 6వ శతాబ్దంలో కమలాపురం తాలూకా, కడప జిల్లాలో లభ్యం అయింది.

బ్యాంకాక్ లో రెండవ లిపుల సదస్సు జరిగింది. ఇందులో అనేక దేశ భాషల లిపుల ప్రతినిధులతో బాటు తెలుగుతో కూడిన అనేక భారతదేశ భాషల లిపుల ప్రతినిధులు పాల్గొన్నారు. పాల్గొన్న అన్ని భాషల లిపులలో ప్రథమ ప్రపంచ ఉత్తమ మొదటి లిపిగా కొరియన్ భాష లిపి, ప్రపంచ ఉత్తమ ద్వితీయ లిపిగా తెలుగు భాషా లిపి నిలిచాయి. ఇపుడు తెలుగు లిపి ప్రపంచ భాషల లిపులలో ఉత్తమ రెండవ లిపి.

What are main Slangs in Telugu?

తెలుగు బాషలో గల మాండలికాలు:

మాండలికాలు అనేవి భాషలో అంతర్గత భాషలు. భాషలో మాండలికాలు ఉండటం సర్వసాధారణం. ఏ భాషను గమనించినా అందులో మాండలికాలు మనకు అగుపించక మానవు. తెలుగులో ప్రధానమైన మాండలికాలు నాలుగు. చాలా వరకు మాండలికాలను ప్రత్యెక భాషగా కొందరు భావిస్తారు కాని ఇవి ప్రత్యేకమైన భాషలు కావు. ప్రధాన భాషలో అవి అంతర్గత భాషలు మాత్రమే (అని మనం తెలుసుకోవాలి).

మాండలికాలు:

  1. కళింగాంధ్ర
  2. కోస్త
  3. తెలంగాణ
  4. రాయలసీమ

తాజా సర్వేల ప్రకారం భారతదేశంలో ఎక్కువ ప్రజలు మాట్లాడే మూడవ భాష మన తెలుగు భాష. హిందీ, బెంగాలీ భాషలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే తెలుగు ప్రపంచంలోనే ఎక్కువ ప్రజలు మాట్లాడే 15వ భాష.

Mana Telubu Basha Video

Read Also:

2 thoughts on “History: About Telugu Language in Telugu”

Comments are closed.