చాయ్ చేయు విధానం తెలుగులో (How to prepare Tea in Telugu) మీకోసం.
ఛాయ్… మనందరం అమితంగా ఇష్టపడే పానియం. దీనిని ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువే ఏమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఛాయ్ అంత రుచి కలిగిన పానీయం కాబట్టి. మీక్కూడా ఛాయి అంటే చాలా ఇష్టం కదా!?
ఇష్టపడి తాగే టీని మన స్వంతగా తయారు చేస్కోవడం అంత క్లిష్టమైన పని కాదు. కానీ రుచి కరమైన ఛాయి చేయడం అందరికి సాధ్యపడక పోవచ్చు. ముఖ్యంగా ఒంటరిగా (పెళ్లి కాని వారు, singles) ఉంటున్నవారికి ఇది కమ్మగా చేయడం అంత తేలిక కాకపోవచ్చు. కాబట్టి ఈరోజు మీకోసం ఛాయ్ ఎలా చేయాలో చెబుతాను.
కావలసిన పదార్థాలు:
- చిక్కని పాలు – 1 మధ్యస్తంగా (మీడియం) ఉన్న కప్
- చక్కర – 3 టేబుల్ స్పూన్స్
- చాపత్త (టీ పౌడర్) – 1 టేబుల్ స్పూన్
- నీళ్ళు – 3 మధ్యస్తంగా (మీడియం) ఉన్న కప్పులు
ఛాయ్ ఎలా చేయాలి (How to prepare Tea)?
స్టెప్ – 1:
టీ పాత్రలో పైన చెప్పుకున్న విధంగా ఒక కప్పు పాలు, 3 కప్పుల నీళ్ళు పోసుకోవాలు.
స్టెప్ – 2:
1 టేబుల్ స్పూన్ చాపత్త, 3 టేబుల్ స్పూన్స్ చక్కర టీ పాత్రలో వేయాలి. ఒకవేళ చక్కర ను ఎక్కువ ఇష్టపడితే ఇంకాస్త రుచికి తగినట్టు వేస్కోవచ్చు.
స్టెప్ – 3:
చాయి పాత్ర స్టవ్ మీద పెట్టి, స్టవ్ వెలిగించండి తక్కువ మంట పెట్టాలి (మంట మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా ఉండేట్టు చూస్కోవాలి). అలా ఒక 15 నిమిషాల పాటు ఉంచాలి.
గమనిక: పాత్ర మీద మూత మాత్రం పెట్టకూడదు.
కమ్మని ఛాయ్ సిద్దం:
15 నిమిషాలు పూర్తయిందా? అయితే మీ ఛాయ్ తాగడానికి సిద్ధమైనది. కప్పులు తీస్కోని పోస్కోని తాగండి.
ఇదండీ ఛాయ్ చేయవలసిన చిన్న పద్దతి. ఒకసారి మీరూ ఇలా చేసి చూడండి.
Read Also: