Bangaaru konda – Telugu Kavita
బంగారు కొండ
చుట్టూ చిక్కని చీకటి
కదలలేని స్థితిలో….నేను
ఊపిరి తీస్తున్నానో లేదో తెలీదు
నాలో జీవం ఉందోలేదో తెలీదు……
కానీ,
నన్ను కనీసం చూడకుండానే
ప్రేమించిన మా అమ్మకు తెలుసు…..
నేను ఊపిరితో ఉన్నానని
నాలో జీవం ఉందని
నేను బంగారు కొండనని…..
కలం పేరు: శాంతు
For more poems of Shaantu: Click here