హీరో కి హెల్ప్ చేయండి – కథ

రచన: తార్-అవతార్

ఫీల్ ది ఫీల్ ప్రొడక్షన్ సమర్పించు
(ఫీల్ తో చదవండి, ఫీల్ ని ఆనందించండి)

హీరోకి హెల్ప్ చేయండి

(స్టొరీ చదవండి కొంచం ఫన్నీగా అండ్ క్రియేటివ్ గా

అనగనగా ఒక ఊరిలో కొంత మంది స్నేహితులు, వారు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కలిసి మెలసి చదువుకుంటూ ఆడుకుంటూ సరదాగా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉండే వాళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి మెలసి ఉండటం వళ్ళ వారి ఆశయాలు, ఆలోచనలు ఒకే విధంగా ఉండేవి. ఈ ఫ్రెండ్స్ గ్రూప్ లో అమ్మాయిలు మరియు అబ్బాయిలు కలగలసి క్లోజ్ ఫ్రెండ్స్ లా ఒకరి బాధలు, సంతోషాలు మరొకరికి పంచుకుంటారు. వాళ్ళల్లో చాలా మంది డ్రీం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని. సో వాళ్ళ డ్రీం వైపుగా వాళ్ళందరూ కష్ట పది చదివి చివరికి అనుకున్న విదముగా ఆ ఫ్రెండ్స్ గ్రూప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక్కో పొజిషన్ లో జాయిన్ అవుతారు.

ఆ ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి పైలట్స్ గా అఖిల్, అనన్య, అరవింద్, ఆనంద్, అనూష, అభి, అనురాధ వీళ్ళు జాయిన్ అవుతారు. మన ఈ స్టొరీ లో హీరో – అఖిల్, హీరోయిన్ – అనన్య.

అఖిల్, అనన్య లకు చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం. ఆ ఇష్టం వల్ల క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఒకరిని ఒకరు బాగా లవ్ చేసుకుంటుంటారు. ఈ లవ్ విషయం ఇద్దరికీ తెలుసు కాని ఎప్పుడు ఒకరి ముందు ఒకరు చెప్పుకోలేదు. బయట పడలేదు. వీళ్ళ లవ్ విషయం ఫ్రెండ్స్ అందరికి తెలుసు. ఫ్రెండ్స్ అంత వీళ్ళు ఎప్పుడు లవ్ ప్రపోజ్ చేసుకుంటారా అని వీల్లకన్న ఎక్కువ ఆత్రుతతో ఉంటారు. లైఫ్ లో సెటిల్ అయ్యారు  కదా ఇంకా వీళ్ళు ప్రేమని వ్యక్తపరుచుకోవటం లేదు ఏంటి అని ఈ ఫ్రెండ్స్ అందరు కలసి (అఖిల్, అనన్య కాకుండా మిగిలిన వాళ్ళు) ఒక చిన్న ప్లాన్ వేసుకొంటారు.

ప్లాన్ లో భాగంగా అబ్బాయిలు అంత కలిసి అనన్య దగ్గరికి వెళ్లి అఖిల్ నీకు రేపు మార్నింగ్ గ్రీన్ పార్క్ లో 6 కి ఎదో చెప్పాలి అనుకుంటున్నాడు నువ్వు వెళ్ళు అని చెప్తారు. అదే విధంగా అమ్మాయిలు అంతా కలిసి అఖిల్ దగ్గరికి వెళ్లి అనన్య నీకు రేపు మార్నింగ్ 6 కి గ్రీన్ పార్క్ లో ఎదో చెప్పాలి అంటుంది అని చెప్తారు. ఇక అప్పుడు ఆ ఇద్దరిలో ఆనందం… పట్టలేని ఆనందం… ఇన్నాల్టికి వీళ్ళ లవ్ స్టొరీ ఒక కొలిక్కి రాబోతుంది అని పట్టలేని ఆనందం తో ఆ రాత్రి అంత వాళ్ళు రేపటి కోసమే కలలు కంటూ ఉంటారు. కళలు కంటుండగానే డేట్ మారుతుంది.. తెల్లారుతుంది.

అఖిల్ వైట్ అండ్ వైట్ లో హీరోలా రెడీ అయ్యి గ్రీన్ పార్క్ కి వెళ్లి అనన్య కోసం వెయిట్ చేస్తుంటాడు. అప్పుడు అఖిల్ అనన్యను దూరం నుంచి చూస్తాడు… అప్పుడు ఎలా ఉంటుంది అంటే తెల్లని మంచు లో వైట్ డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ వస్తున్న దేవకన్యలా నడుచుకుంటూ వస్తుంది. (తోలి ప్రేమ ఫిల్మ్ లో హీరో, హీరోయిన్ ని ఎలా మార్నింగ్ మంచులో వైట్ డ్రెస్ లో చూసి ఫీల్ అవుతాడో అలా) ఇద్దరు దగ్గరికి చేరుకొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఇలా కొంచం సేపు మౌనంగా అలా నిల్చుండిపోతారు. అప్పుడు ధైర్యం చేసి… అనన్య నిశబ్దాన్ని బ్రేక్ చేస్తూ అఖిల్ ని అడుగుతుంది ఏదో చెప్పటానికి పిలిచావంట చెప్పు ఎందుకలా సైలెంట్ గా ఉంటావ్ అని అడుగుతుంది. అఖిల్ అంటాడు నువ్వే కదా నాకు ఎదో చెప్పాలని పిలిచావంట అని అంటాడు. అప్పుడు ఇద్దరికీ అర్థం అవుతుంది ఇదంతా వాళ్ళ ఫ్రెండ్స్ పనే అని. అప్పుడు ఇద్దరు కొంచెం సేపు ఆశ్చర్యంతో కూడిన ఆనందంలో టెన్షన్ పడుతూ ఆలోచించుకోటానికి కొంచం దూరం జరిగి ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేస్తారా అని సిగ్గుతో… టెన్షన్లో ఉంటారు. అప్పుడు అఖిల్ ద హైర్యం చేసి తనే ముందు ప్రేమను వ్యక్త ప అరచాలని డిసైడ్ అయ్యి… అనన్య వైపు చూసి దగ్గరకు నడుచుకుంటూ వెళ్తుంటాడు. అదే టైం లో అనన్య కూడా అఖిల్ వైపు కళ్ళల్లోకి చూస్తూ దగ్గరకు వస్తుంది. అప్పటి వరకు అఖిల్ కళ్ళల్లో కనిపించిన సంతోషం కాస్త భయంగా మారటం చూస్తుంది అనన్య. ఆ భయానికి కారణం ఏంటో తెలుసుకునే లోపే అనన్య వెనుక నుంచి ఒక రాకాసి పక్షి (బిగ్ బర్డ్) వీరి వాపు దూసుకు వస్తుంది. అఖిల్ అనంయను ఆ రాకాసి పక్షి నుంచి కాపాడేందుకు విఫల ప్రయత్నం చేస్తాడు. ఈ లోపు ఆ పక్షి అనంయను దాని కాళ్ళతో పట్టుకొని ఎగిరే టైంలో అఖిల్ దాని తోకను పట్టుకుంటాడు. రాకాసి పక్షి గాలిలోకి ఎగురుతుంది.

అలా గాలిలో ఎత్తులో ఎగురుతున్న రాకాసి పక్షి తోకను పట్టుకున్న అఖిల్ పాకుకుంటూ అతి కష్టం మీద అనన్య ఉన్న కాళ్ళ దగ్గరకు చేరుకొని విడిపించటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ రాకాసి పక్షికి తెలిసి విదిలిస్తుంది. ఆ విదిలింపుకి అఖిల్ పట్టు కోల్పోయి జారిపోతుంటే అనన్య పట్టుకుంటుంది కాని ఎంత సేపని పట్టుకుంటుంది. చిన్నగా అఖిల్, అనన్య చేతులు పట్టుకోల్పోతుంటాయ్. 600 ఫీట్ హైట్ లో ఎగురుతున్న పక్షి నుంచి అఖిల్ అనన్యను కాపాడలేక చేతులు పట్టు కోల్పోయి జారిపోతుంటే… తన ప్రాణానికి ప్రాణమయిన అఖిల్ అలా కింద పడిపోవటం తట్టుకోలేక బాధతో స్పృహ కోల్పోతుంది. అఖిల్ కూడా తన ప్రాణానికి ప్రాణం అయిన అనన్యను రాకాసి పక్షి నుంచి కాపాడలేక బాధతో కింద పది పోతుంటాడు. అప్పుడు సడెన్గా ఒక చిన్న పాటి దాదాపుగా 600 ఫీట్ హైట్ ఉన్న పర్వతం లాటి కొండ ఒకటి వస్తుంది. సో అఖిల్ 10 హైట్ కంటే తక్కువ హైట్ నుంచే ఆ కొండ మీద పది దొర్లుకుంటూ కొంత అంచుకు వెళ్లి ఆగుతాడు. అలా కన్నీటితో నిండిన కళ్ళతో ఆ రాకాసి పక్షి ఎగురుతున్న వైపు చూస్తూ కళ్ళు ముసుకుంటాడు. అప్పుడు ఆ పక్షి సూర్యుడు అస్తమిస్తున్న వైపు వెళ్ళటం సముద్రం మద్య లో ఉన్న ఒక పెద్ద జి ఉహ లోకి తీసుకొని వెళ్ళటం కనిపిస్తుంది. అనన్యను బాలి ఇచ్చి ఈ లోకానికి మకుటం లేని మహా రాజు అవ్వాలని ఒక దుష్ట మాంత్రికుడు సిద్దపడుతుంటాడు. బలికి సిద్దం చేసి అనన్యను బాలి ఇస్తుంటే అఖిల్ ఆపటానికి పరుగెత్తుకుంటూ మాంత్రికుడు వద్దకు వెళ్తుంటాడు. ఈ లోపు మాంత్రికుడు అనన్యను బాలి ఇచ్చేయగా చిందిన అనన్య రక్తం అఖిల్ మొహం మీద పడటంతో అఖిల్ కి మలకువ వస్తుంది. కంగారుగా పైకి లెగిసి చుట్టూ చూసుకుంటాడు అఖిల్. సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు. చుట్టూ పెద్ద లోయ. కొండ నుంచి కిందకు వెళ్ళటానికి ఎటువంటి దారి ఉండదు. 600 ఫీట్ హైట్ ఉన్న కొండ నుంచి దిగలేక, సూర్యుడు అస్తమిస్తే అనన్యకు పొంచి ఉన్న ప్రమాదం తెలిసి ఏమి చేయలేక నిస్సహాయుడై అఖిల్ బాదతో పైకి చూస్తూ దేవుడా అని పెద్దగా అరుస్తూ మోకాళ్ళమీద కుప్ప కూలి పోతాడు. చిన్నగా తలని నేలవైపు తిప్పి చూస్తూ ఏడుస్తుంటే కన్నీటి బిందువులు ఒక్కొక్కటి చిన్నగా నేల మీద పడుతుంటాయ్.

సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన హీరో అఖిల్ కి మీరు హెల్ప్ చేయండి.

600 ఫీత్స్ హైట్ ఉన్న కొండ చుట్టూ పెద్ద లోయ.. కొండ నుంచి కిందకు వెళ్ళటానికి ఎటువంటి దారి లేదు.

సూర్యుడు మెల్లగా ఆఫ్టర్ నూన్ నుంచి ఈవెనింగ్ వైపు వెళ్తుంటాడు. సూర్యుడు అస్తమిస్తున్న వైపు మాంత్రికుడు గుహ ఉంది. సూర్యుడు అస్తమిస్తేయ్ అక్కడ అనన్య కూడా అస్తమించినట్టే.

ఫ్రెండ్స్ ప్లీజ్ మన హీరో అఖిల్ కి హెల్ప్ చేయండి.

క్లైమాక్స్ కొంచం ఫన్నీగా చిలిపిగా కామెడీ గా ఉండేత్తుగా చెప్పండి కామెంట్స్ లో…

ఈ కథ పై పాఠకులు రాసిన ‘క్లైమాక్స్’ లను దిగువ comments లో చదవండి.

క్లైమాక్స్:

అలా బాధ పడుతున్న టైం లో చిన్నగా అఖిల్ పాకెట్ లో టడా డడా టట్టావ్ టడా డడా టట్టావ్ టడా డడా డట్టావ్ టడడడావ్ అని ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్ నుంచి. (అప్పుడు రాజమౌళి ఫిలిమ్స్ లో స్టాంప్ పడినట్టు మన టెలీకాం సింబల్ పడుతుంది) ఆ సౌండ్ విన్న అఖిల్, చిన్న ఆనందం తో పాకెట్ లో ఉన్న మోబాయిల్ బయటికి తీస్తాడు. (అప్పుడు బ్రాండెడ్ మోబాయిల్ హ్యాండ్ సెట్స్ ఎంత ఎత్తునుంచి పడినా చెక్కు చెదరదు అని ఆడ పడుతుంది) కాల్ లిఫ్ట్ చేసి ఫ్రెండ్స్ కి జరిగిన విషయాన్ని అంత చెప్పి ధైర్యం తో పైకి లెగిసి నుంచొని దుమ్ముదులుపుకుంటాడు. (అప్పుడు శూట్స్ అండ్ డ్రెస్సెస్ దుమ్ము నిలవనివ్వాదు అని ఆడ్ పడుతుంది).

అఖిల్ ఇచ్చిన సమాచారం మేరకు ఫ్రెండ్స్ ట్రైనీ హెలికాప్టర్ వేసుకొని అఖిల్ ని చేరుకుంటారు. అలా  ఆ అ స్తమిస్తున్న సూర్యుడి వైపు ప్రయాణించి గుహను చేరుకొని, ఆ దుష్ట మ ఆన్త్రికునితో పోరాడి అంత మొండించి అనన్యను కాపాడి తమ ప్రేమ చెప్పుకొని హ్యాప్పీగా వెనుకకు తిరుగు ప్రయాణం చేస్తారు….


కథ కంచికి మనం ఇంటికి హహ్హహ్హహ్హా….

14 thoughts on “హీరో కి హెల్ప్ చేయండి – కథ”

  1. neethuuuu sister nee story keka super bale undhi nee climax…..hahaha

    naaa climax comedy ga untundhi .

  2. silly nee climax super keka neelonu talent undhi silly come on carry on mari nuvvu kooda oka story rasi pampu

  3. Silly: Akhil kanniti chukkalu akkada unna raayi pina padi, devakanya ki vimukthi kalgutundi, amme tanki akhil help chesadu so, ahkil ki oka varam istaundi, so that akhil chinna ga ayyi guhaloki velli ananyan

  4. Silly: Akhil kanniti chukkalu akkada unna raayi pina padi, devakanya ki vimukthi kalgutundi, amme tanki akhil help chesadu so, ahkil ki oka varam istaundi, so that akhil chinna ga ayyi guhaloki velli ananyan

  5. hi avatar kaka ra
    nu great
    ne lo chala talent unadi
    all the best next story kosamu waite chastu ne “k”

  6. chala bavundi super d keka.kani e story lo anusha ne peru anduku pettavu?vere perlu dorakaleda. swarna anusha lanti names nijamga bavunnayi
    proceed

  7. neethu neeharika:akhil karchina kanniti chukkalaku marindha sekthi

    vachi naa priyuralini ippudu dhakkinchukoka pote naa preyasini

    yeppatiki dhakinchukolenu ani devudu oktariga unna thanaku okka rekkala

    gurranni isthadu tana preyasini kapadukomani ventanai thana preyasinu

    kapadukovalani bayalu derthadu thana preyasi raktam madugulatho kinna

    spruha tho padukoni undhi tana chethini pattukoni ethukoni rekkala

    gurram meedha tana mudhu kurchopettukuntadu akkadi nunchi paiki velthu

    thana preyasi ni kannititho chusthu tanatho techukuntunnadu

    padhapadutunna akhil ni devudu chusi tana preyuralu raktham madugulatho

    badhapadutunna tana raktham madugulanu mayam chesthadu vella prema

    devathulu chusi vellidharini okka varam korukomani auntaru velli

    korukunna aa varam malli mammalnu jenma jenmalu elanai premikuluga

    brathikinchandi ani akhil korukuntadu tana preyasi anandam tho

    namaskaristuntadhi devathalaku… 🙂

  8. neethu neeharika:akhil karchina kanniti chukkalaku marindha sekthi

    vachi naa priyuralini ippudu dhakkinchukoka pote naa preyasini

    yeppatiki dhakinchukolenu ani devudu oktariga unna thanaku okka rekkala

    gurranni isthadu tana preyasini kapadukomani ventanai thana preyasinu

    kapadukovalani bayalu derthadu thana preyasi raktam madugulatho kinna

    spruha tho padukoni undhi tana chethini pattukoni ethukoni rekkala

    gurram meedha tana mudhu kurchopettukuntadu akkadi nunchi paiki velthu

    thana preyasi ni kannititho chusthu tanatho techukuntunnadu

    padhapadutunna akhil ni devudu chusi tana preyuralu raktham madugulatho

    badhapadutunna tana raktham madugulanu mayam chesthadu vella premanu

    devathulu chusi vellidharini okka varam korukomani auntaru velli

    korukunna aa varam malli mammalnu jenma jenmalu elanai premikuluga

    brathikinchandi ani akhil korukuntadu tana preyasi anandam tho

    namaskaristuntadhi devathalaku… 🙂

  9. kada chadive vadu aka bigina kada chadivetlga kada rayali kani vadini madyalo ayomayaniki guri chesi premato adukovaddu…. duram anta narakamo neeku teliyadu anukunta,,, so….. keep it mind.

  10. hahaha.. okka kadha lo enni cinimalu chupincharu. vitalachari direction nundi rajamouli creativity varaku denini vadalaledu.. funny ga rasaru.bagundi 🙂

Comments are closed.