Egirene Pakshulamai – Telugu Kavitha

నువే నను అలా ఇలా
కవ్వించావే నన్నే చేరి

నేనే నిను అలా ఎలా
ప్రేమించానే ప్రాణం లాగా

అను క్షణం వినే స్వరం
ప్రతి క్షణం నీకై ధ్యానం

కలై పోయే కలవరం
చెలై పోతే స్వయంవరం

ఎవ్వరు ఎవరనుచు నా గుండె.. నీ ఒళ్ళో
ఊహల్లో ఉగిసలు ఆడే …

నువ్వెవరు నేనెవరు ఏకంగా ..ఈ లోకంలో
ఎగిరేనే రెక్కలొచ్చి పక్షులమై ..