Amma… Kuturu – Telugu Kavitha

నా జీవితంలో  నేను  అత్యంత ఆనందంగా గడిపిన సమయం

                     నీవు నాతో వున్న సమయం

నా జీవితంలో  నేను  అత్యంత బాధపడిన  సమయం

                     నీవు నన్ను విడిచి స్వర్గానికి చేరుకున్న సమయం

నా జీవితంలో  నేను  అత్యంత ధైర్యంగా వున్న    సమయం

                     నీవు నా ప్రక్కన నిదురించిన సమయం

నా జీవితంలో  నేను  అత్యంత ఇష్టపడేది

                     నీ పిలుపు

నా జీవితంలో  నేను  మరువలేనిది

                     నీ ప్రేమ

నీ జ్ఞాపకాలే ఊపిరిగా భావిస్తున్న నీ కూతురు- హిమ