జలసిరులు – కవిత

నేడు చెరువులు కుంటలు

ఆక్రమణలకు గురై పోయి

బావులు బోర్లు ఎండిపోయి

తాగు నీరు సాగు నీరు కరువై

పల్లె వాసులు ఊళ్ళు ఖాళీ చేసి

పట్టణాలకు కూలీలుగా వలసపోతే

పల్లెలు నాడు దేశానికి పట్టుకొమ్మలు

నేడు అవి ఎడారి సీమలు

పల్లె ప్రజలారా

కలపండి భుజం భుజం

శాస్త్ర వేత్తల సహకారంతో

ప్రతి రైతు అపర భగీరథుడై

పాతాళ గంగను కనిపెట్టాలి

ఇంకుడు గుంతలు తవ్వండి

జలసిరులను ఒడిసి పట్టండి

సేంద్రియ ఎరువులను వాడండి

గ్రామాలే దేశానికి జీవనాడులని

ఎలుగెత్తి చాటండి

మేరా భారత్ మహాన్