Kopam Kopam – Telugu Kavitha

కనిపించె ప్రేమద్వీపం,

చూపింది గగనస్వర్గం,

కుదిరె మితిమీరినట్టహాసం,

ఇంతజరిగె చిన్నదోషం,

తెచ్చింది మరల క్రోధం,

నిలువెత్తు కలహరూపం,

మది నలిగి నలిగి పాపం,

వేసింది మారువేషం,

మరిచింది చెలిమి పాశం,

చెదిరింది కన్న స్వప్నం,

కూలింది కలల భవనం,

విధి వీక్షించె వింత దృష్యం,

ఇది నాకు తగని శాపం,

ఇది నాకు తగని శాపం….


-సుధీర్ కుమార్
చిరుకూరిపాటి