గుండె నొప్పికి సంబంధించిన కొన్నిముఖ్యమైన అంశాలు

మనము చూసే సినిమాలవల్ల ప్రజలలో గుండె నొప్పి గురించి చాలా అపోహలు ఉన్నాయి సినిమాలలో ఏదైనా దుర్వార్త విన్నప్పుడు హీరోయిన్ లేదా హీరో తండ్రి లేదా తల్లి గుండె పట్టుకొని కుప్పకూలిపోతే అప్పుడు ప్రేక్షకులకు వాళ్లకు గుండె నొప్పి వచ్చినట్లు అర్ధము అవుతుంది యదార్ధానికి జరిగేది ఇంకో రకముగా ఉంటుంది ప్రస్తుతము ఆధునిక జీవన విధానములో మనము తినే తిండి మన అలవాట్లు నడివయస్సువారికి కూడా గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి గుండె నొప్పి వచ్చినప్పుడు ,రాబోయే ముందు జరిగే మార్పులు లేదా లక్షణాలు అందరు తెలుసుకుంటే గుండె నొప్పి వచ్చిబెనవారికి సకాలములో వైద్య సదుపాయము అందించి ప్రాణాలను కాపాడవచ్చు. 

గుండె నొప్పి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది?

గుండె నొప్పి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో ముందు తెలుసుకోవాలి. గుండె నొప్పి వచ్చినప్పుడు నిరంతరమూ పనిచేయవలసి గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గిపోవటమో ఆగిపోవటమో జరుగుతుంది. గుండెకు రక్తాన్ని తీసుకొని వెళ్లే ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకు పోవటము వల్ల ఇది జరుగుతుంది. గుండె కండరాలకు ఆక్సిజన్ కలిగిన రక్తము అందకపోతే ఆ కండరాలు సరిగా పనిచేయవు. సాధారణముగా కనిపించే గుండె నొప్పి లక్షణాలు కొన్నితెలుసుకుందాము. ఛాతీ నొప్పితో మొదలవుతుంది. ఈ నొప్పి కూడా చాతి మీద పెద్ద బండ పెట్టినట్లుగా ఉంటుంది. ఇలా దాదాపు 15 నిముషాలు ఉంటుంది. ఈ నొప్పి కూడా ఛాతీ మధ్య కేంద్రీకృతమై ఉంటుంది.భుజాలు,మీద,చేతులు వీపు ప్రాంతాలలో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. కొన్ని సందర్భాలలో దౌడల్లో,దంతాలతో కూడా నొప్పి ఉంటుంది.ఛాతిలో నొప్పి క్రమముగా తెరలు తెరలుగా  పెరుగు తుంటుంది కడుపు పై భాగములో నొప్పి ఉంటుంది. ఊపిరి సరిగా అందదు. చెమట విపరీతముగా పడుతుంది.గుండె రక్తాన్ని పంపింగ్ చేయటములో సక్రమముగా ఉండదు కాబట్టి ఆ వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు. చాలా అరుదుగా అంటే మధుమేహ రోగుల్లో గుండె నొప్పి అంత బాధాకరం కాదు కొన్ని సందర్భాల్లో అసలు ఏరకమైన నొప్పిని అనుభవించరు 

ఇవికాకుండా కనిపించే ఇతర లక్షణాలు ఉదర భాగములో నొప్పి, గుండెల్లో మంట, విపరీతముగా అలిసిపోవటం,వాంతి వచ్చేటట్లు ఉండటం, మెదభుజాలువీపు పైభాగములలో బిగుతుదనము మొదలైనవి. ఇక్కడ గమనించవలసినది ఏమిటి అంటే అందరిలో గుండె నొప్పి లక్షణాలు ఒకే రకముగా ఉండవు. చాలా సందర్భాల్లో గుండె నొప్పిని ఉదరంలో  అజీర్తి వల్ల గ్యాస్ ఏర్పడి  వచ్చే అసౌకర్యముగా భావించి అశ్రద్ధ చేస్తారు. పైన పేర్కొన్న లక్షణాలలో ఒకటి కన్నా ఎక్కువ కనిపిస్తే అత్యవసరంగా డాక్టర్ సహాయము పొందాలి. 

గుండె నొప్పి వచ్చినప్పుడు ఏమిచేయాలి?

లక్షణాలను గమనించి గుండె నొప్పి అన్న అనుమానము వచ్చినప్పుడు త్వరగా ఆసుపత్రికి తరలించాలి. ఎందుకంటే గుండె నొప్పి వచ్చినవారికి ప్రతి నిముషము విలువైనది ఏమాత్రము కాలయాపన చేయరాదు. ఆసుపత్రికి  తరలించే లోపు యాస్ప్రిన్ మాత్రను పొడి చేసి నీటిలో కలిపి త్రాగించాలి. ఆఫీసుల్లోగాని ఇళ్ళలో గాని  అంబులెన్స్ ఆసుపత్రులు వంటి అత్యవసర ఫోన్ నంబర్లు ఉండాలి. గుండె నొప్పి కార్డియాక్ అరెస్ట్ కు తేడావుంది. ఈ రెంటి విషయములో కన్ఫ్యూజ్ కాకూడదు. కార్డియక్ అరెస్ట్ అంటే గుండె అకస్మాత్తుగా పనిచేయటం మానేస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే హార్ట్ పంపింగ్ సిస్టం సరిగా పనిచేయక పోవటం వల్ల పంపింగ్ సిస్టం సరిగా పనిచేయకపోవటానికి కారణము ఎలక్టికల్ డిస్ట్రబెన్స్ పంపింగ్ సరిగా పనిచేయకపోవటం వల్ల శరీర భాగాలకు రక్తప్రసరణ సరిగా జరగదు. గుండె నొప్పికి కార్డియాక్ అరెస్ట్ కు తేడాలు తెలుసుకోవటానికి రెండు ఫాక్ట్ ఫైల్స్ అవసరము. 

మొదటిది సడన్ కార్డియక్ అరెస్ట్ ఫ్యాక్ట్ ఫైల్ :-

ఈ ఆకస్మికముగా గుండె ఆగిపోవటం అనేది గుండెలోని గజిబిజిగా ఉండే ఎలక్ట్రికల్ స్థితి దీని ఫలితముగా మెదడు శరీరానికి రక్తప్రసరణ సక్రమముగా ఉండదు.సాధారణమౌగా వచ్చే ఈ ఆకస్మికముగా  గుండె ఆగిపోవటం వెంట్రిక్యులార్ ఫైబ్రిల్లషన్ వాళ్ళ జరుగుతుంది అంటే జఠరికలో ఫైబ్రిల్స్( సన్నని పోగులు ఏర్పడటం)దీనికి కారణము గుండె యొక్క విద్యుత్ ప్రచోదనాలు గజిబిజీగాఉండి,గుండె ఆగిపోయి మల్ల వేగముగా కొట్టుకోవటం మొదలవుతుంది. దీని లక్షణము ఆ వ్యక్తి స్పృహ కోల్పోవటం రెండవది శ్వాసక్రియలో కొంత విరామము.ఫలితముగా ఆక్సిజన్ అందదు కాబట్టి ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ  పరిస్థితిలో వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. నిముషానికి పదిశాతము చొప్పున జీవించే అవకాశాలు తగ్గిపోతుంటాయి. కాబత్తి  నుండి 10 నిముషాలలో మెదడు దెబ్బతింటుంది.దీనికి చికిత్స డి ఫైబ్రిల్లషన్ అంటే గజిబిజిగా ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీని బాహ్యముగా డిఫైబ్రిల్లటర్ అనే పరికరముద్వారా షాక్ ఇప్పించటమే  

రెండవది హార్ట్ అటాక్ ఫ్యాక్ట్ ఫైల్ :-

దీనిని మెడికల్ గా మయోకార్డియల్ ఇంఫ్రాక్షాన్ అంటారు సాధారణము గా ఎక్కువమందికి వచ్చే గుండె నొప్పి ఈ విధముగానే వస్తుంది.గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది.ఫలితముగా గుండె కండరాలు అక్సిజన్  అందక శాశ్వతంగా దెబ్బతింటాయి. ఈ అడ్డంకులు ఏర్పడటానికి కారణము కొలెస్ట్రాల్  ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్తప్రసరణ తగ్గుతుంది.దీనినే మెడికల్  పరిభాషలో “అక్లూషన్ “అంటారు దీనివల్ల గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గి సక్రమముగా అక్సిజన్  అందదు. ఈ రకమైన గుండె నొప్పి లక్షణాలు చాతి  బిగుసుకున్నట్లు ఉండటం,ఎడమచేయి తిమ్మిరి లేదా నొప్పిగా ఉండటం, వీపు క్రిందిభాగము మీద దవాడల్లో నొప్పిఆహారము జీర్ణము కాక పోవటము ఛాతీపై పెద్ద బరువు  పెట్టినట్లు ఉండటము శ్వాస సరిగా జరగకపోవటం మొదలైనవి. ఈ పరిస్తుతులలో రోగి స్పృహలోనే ఉంటాడు చాలా మంది బాధితులు కోలుకొని సాధారణజీవితము గడపగలరు కానీ సకాలములో సరియైనచికిత్స అందాకా ముందుంటుల మంది చనిపోతున్నారు ఈ గుండె నొప్పి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ కు దారి తీస్తుంది. 

గుండెనొప్పికి చికిత్స ఆంజియోప్లాస్టీ

గుండెనొప్పికి చికిత్స ఆంజియోప్లాస్టీ ఇది మూసుకున్న రక్తనాళాలను మెడికల్ బెలూన్ వలన తెరిపిస్తుంది. ఆ తరువాత స్టెంట్  ధామణిలో ఉంచి ధమని మూసుకుపోకుండా చూడవచ్చు కొన్ని సందర్భాలలో త్రంబోలైటిక్స్ అనే మందుల ద్వారా క్లాత్ ను తొలగించవచ్చు. నైట్రోగ్లిజరిన్ అనే మందు చాతి నొప్పి తగ్గటానికి వాడతారు. ఇవండీ గుండెనొప్పి, కార్డియాక్ అరెస్ట్ కు సంబంధించిన వివరాలు క్లుప్తముగా ,సాధారణ ప్రజలకు అర్ధము అయేటట్లుగా ఈ వివరాలు అందించాను ఏది ఏమైనప్పటికి  అలవాట్ల ద్వారా గుండెనొప్పిని దూరము చేయవచ్చు. ధూమపానం మధ్యపానమునకు దూరముగా ఉండటం, ఎక్కువగా క్రొవ్వు కలిగిన ఆహారాన్ని తగ్గించటము ఒత్తిడి ఆందోళనలను తగ్గించుకోవటం మొదలైన ముందస్తు జాగ్రత్తలు తీసుకొని గుండె నొప్పి ప్రమాదం నుండి మనలను మనము రక్షించుకోవచ్చు.